వినోద్ ప్రకాష్ శర్మ | |
---|---|
![]() | |
జననం | 1938 ఏప్రిల్ 6 అలహాబాద్ ఉత్తరప్రదేశ్ భారతదేశం |
మరణం | 2015 అక్టోబర్ 10 న్యూఢిల్లీ భారతదేశం |
వృత్తి | శాస్త్రవేత్త |
పురస్కారాలు | పద్మ భూషణ్ పద్మశ్రీ |
వినోద్ ప్రకాష్ శర్మ భారతదేశానికి చెందిన కీటక శాస్త్రవేత్త పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలను పొందాడు.
వినోద్ ప్రకాష్ శర్మ 1938 ఏప్రిల్ 6న భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించాడు.[1] స్థానికంగా ప్రారంభ విద్యాభ్యాసం తర్వాత, అతను అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చేరాడు, అక్కడ అతను 1960లో, 1964లో పట్టాపొందాడు.
శర్మ 1969లో దోమలపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టాడు. దోమల ద్వారా మానవులకు కలిగే వ్యాధులను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. మలేరియా డెంగ్యూ వ్యాధులపై అనేక పరిశోధనలు జరిపాడు . 1978లో న్యూ ఢిల్లీలోని ఢిల్లీ రీసెర్చ్ డైరెక్టర్గా పనిచేశాడు.
1998లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అడిషనల్ డైరెక్టర్ గా నియమితుడయ్యాడు.
ప్రస్తుతం వినోద్ ప్రకాష్ శర్మ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా [2] ప్రారంభించిన సేఫ్ వాటర్ ప్రచారానికి కూడా నాయకత్వం వహిస్తున్నాడు.
వినోద్ ప్రకాష్ శర్మ అనేక శాస్త్రీయ పరిశోధన విజయాలతో ఘనత పొందారు. మగ దోమలో గురించి ఇతను అధ్యయనాలు ఎక్కువ చేశాడు. దోమల లింగ విభజన కోసం కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన ఘనత ఆయనది. దోమలపై ఇతను చేసిన ప్రయోగం అనేక ఆవిష్కరణలకు దారితీసింది. వినోద్ ప్రకాష్ శర్మ జీవ శాస్త్రానికి చేసిన కృషికి కూడా గుర్తింపు పొందాడు.[3][4]