సుందరం బాలచందర్ | |
---|---|
జననం | 1927 జనవరి 18 మైలాపూర్, చెన్నై |
మరణం | 1990 ఏప్రిల్ 13 (63 ఏళ్ళు) |
వృత్తి | వైణికుడు, సినిమా దర్శకుడు, నర్తకుడు, గాయకుడు, కవి, సినిమా నటుడు, నేపఠ్య గాయకుడు, సంగీత కర్త, ఛాయాగ్రాహకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1934 to 1990 |
జీవిత భాగస్వామి | శాంత |
పిల్లలు | రామన్ (కుమారుడు) |
పురస్కారాలు | పద్మ భూషణ్ |
సుందరం బాలచందర్ (జ: 18 జనవరి 1927 – మ: 15 ఏప్రిల్ 1990) సుప్రసిద్ధ వీణా విద్వాంసులు, దక్షిణ భారత సినిమా దర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు. ఇతని సోదరుడు ఎస్.రాజం, సోదరి ఎస్.జయలక్ష్మి కూడా కళాకారులే. ఇతడు తెలుగులో దర్శకత్వం వహించిన ఏది నిజం (1956) సినిమాకు రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది. బాలచందర్‌కు 1982 లో పద్మ భూషణ్ అవార్డు లభించింది.
బాలచందర్, 1934 లో సీతాకళ్యాణం తమిళ చిత్రంతో బాలనటుడుగా నట జీవితం ప్రారంభించాడు. ఆ సినిమాలో రావణ సభలో ఉండే ఒక బాల విద్వాంసుడి పాత్ర వేసాడు. [1] ఆ తరువాత ఋష్యశృంగార్ (1941), అరైచిమణి (1942) సినిమాల్లో నటించాడు. [2]
1948 లో బాలాచందర్ ఎన్ కనవర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.[3] 1954 లో అతను క్లాసిక్ తమిళ చిత్రం అంధ నాళ్ కు దర్శకత్వం వహించాడు. [4] [5]