హరిద్వారమంగళం ఎ.కె.పళనివేల్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1948 హరిద్వారమంగళం, తమిళనాడు, భారతదేశం |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | డోలు వాద్య కళాకారుడు |
వాయిద్యాలు | డోలు |
హరిద్వారమంగళం ఎ.కె.పళనివేల్ తమిళనాడు కు చెందిన డోలు వాద్య కళాకారుడు.[1]
ఇతడు 1948లో తమిళనాడులోని హరిద్వారమంగళం గ్రామంలో జన్మించాడు. ఇతడు తన తండ్రి ఎస్.కుమారవేల్ పిళ్ళై వద్ద డోలు నేర్చుకున్నాడు. తరువాత 1959 నుండి టి.జి.ముత్తుకుమారస్వామి పిళ్ళై వద్ద డోలు వాయించడంలో సంపూర్ణ శిక్షణ తీసుకున్నాడు. ఇతడు అనేక మంది సంగీత కళాకారుల కచేరీలలో డోలు సహకారం అందించాడు. అనేక సోలో ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతడు నాదస్వరంతో పాటు ఇతర సంప్రదాయ వాద్యాలైన వేణువు, క్లారినెట్, మాండొలిన్, శాక్సోఫోన్ మొదలైన వాటి కచేరీలకు కూడా ప్రక్కవాద్యం అందించాడు. భరతనాట్య కళాకారుల ప్రదర్శనలలో కూడా డోలు వాద్య సహకారం అందించాడు. ఇతడు భారతదేశంలోనే కాక అమెరికా, కెనడా, ప్యారిస్, స్విట్జర్లాండ్, పశ్చిమ జర్మనీ, జనీవా, జపాన్ మొదలైన అనేక ప్రదేశాలలో తన కళాప్రదర్శన కావించాడు. ఇతడు తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాల, అమెరికాలోని వెస్లియన్ యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు.[2] అన్నామలై విశ్వవిద్యాలయం సంగీత విభాగానికి ఎనిమిది సంవత్సరాలు డీన్‌గా పనిచేశాడు. ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి డోలు విద్వాంసుడు ఈయన.[3] ఇతడు తిరువయ్యారులోని శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభకు కార్యదర్శిగా పనిచేశాడు.