జె.వి. సోమయాజులు

జొన్నలగడ్డ వెంకట సోమయాజులు
శంకరాభరణం చిత్రం పోస్టరు
జననంజొన్నలగడ్డ వెంకట సోమయాజులు
(1928-07-30)1928 జూలై 30
లుకలాం అగ్రహారం, శ్రీకాకుళం జిల్లా
మరణం2004 ఏప్రిల్ 24(2004-04-24) (వయసు 75)
హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్, భారత్
నివాస ప్రాంతంశ్రీకాకుళం
ఇతర పేర్లుశంకరశాస్త్రి
వృత్తిసినిమా నటుడు
రంగస్థల కళాకారుడు
ఉద్యోగండిప్యూటీ కలెక్టర్
ప్రసిద్ధిశంకరాభరణం లొ శంకర శాస్త్రి
త్యాగయ్య లో త్యాగయ్య
మతంబ్రాహ్మణ హిందూ
తండ్రివెంకట శివరావు
తల్లిశారదాంబ

జె.వి. సోమయాజులు (జులై 30, 1928 - ఏప్రిల్ 27, 2004) తెలుగుప్రేక్షక హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు. రంగస్థలం, వెండితెర, బుల్లితెర వంటి మాధ్యమాలన్నింటిలో నటించాడు. అతను పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు.

బాల్యం

[మార్చు]

జె.వి.సోమయజులు 1928 జూలై 30 వ తెదీన శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావు లు. ఈయన సోదరుడు చలన చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నటుడు జె.వి. రమణమూర్తి . ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. సోమయాజులు విజయంనగరంలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవాడు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్ప పంతులు" పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. సోమయాజులు తల్లి శారదాంబ అతనిని ప్రోత్సహించింది.

కళాకారునిగా[1]

[మార్చు]

జె.వి.సోమయాజులు స్వయంకృషితో నటన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కుటుంబమంతా మొదటి ప్రపంచయుద్ధ ప్రభావంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినపుడు అతను వ్యధ చెందారు. క్విట్‌ ఇండియా ఉద్యమం (1942), భారత స్వాతంత్ర్య సంగ్రామం, మొదటి రెండో ప్రపంచ యుద్ధాల సంక్షోభం వంటి వాటిని అర్థం చేసుకుంటూ, తాను నమ్మిన నాటకరంగాన్ని విస్మరించకుండా, నిబద్ధతతో నాటక రంగానికి అంకితమయ్యారు. తనసోదరుడు జె.వి.రమణమూర్తితో కలిసి కృషి చేశారు. వీరికి వేదుల జగన్నాథరావు అండదండలు లభించాయి. 1946 నుండి పెళ్ళిపిచ్చి, దొంగాటకం నాటక ప్రదర్శనల్ని ప్రారంభించారు. తర్వాత కన్యాశుల్కం నాటకం ఆడటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి ప్రదర్శన వేయడానికి రెండున్నర సంవత్సరాల కాలం పట్టింది. 1953 ఏప్రిల్‌ 20వ తేదీన కన్యాశుల్కం తొలి ప్రదర్శన ఇచ్చారు. సోమయాజులుతోపాటు రమణమూర్తి, బీరకాయల రామదాసు, ఎం.జోగారావు, వంకాయల వెంకట అప్పారావు, కర్రి పద్మనాభాచార్యులు, వేదుల నరసింహ, జె.వి.శ్రీరామమూర్తి, పోడూరి విశ్వేశ్వరరావు, ఐఎస్‌. రాజకుమారి. వి.వి.సుమిత్ర, యు.ఎస్‌.ఎన్‌.రాజు, ప్రేమనాథ్‌, వేణుగోపాలరావు, రావికొండలరావు, గరిమెళ్ళ రామమూర్తి వంటి ఎందరో కళాకారులు ఈ నాటకంలో భాగస్వాములయ్యారు. ఈ నాటకంలో రామప్ప పంతులు పాత్ర పోషించి ధీరగంభీర స్వరంతో సహనటులందరికీ ఆదర్శంగా నిలిచారు సోమయాజులు. దీనితర్వాత ఆంధ్రనాటక కళాపరిషత్తులో బహుమతులు గెలుచుకుని ప్రతిభను మరింతపదును పెట్టుకోవాలనే పట్టుదలతో మనిషిలో మనిషి, నాటకం, పంజరం, గాలివాన, కప్పలు లాంటి నాటకాలను తీర్చిదిద్ది పోటీలలో నిలిచారు. లక్ష్యాలను సాధించారు. కీర్తిని ఆర్జించారు. ఎన్నో బహుమతులు గెలుచు కున్నారు. రెవెన్యూశాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులలోనే అతనుకు శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది.ఈ సినిమాకు ముందే దర్శకుడు యోగి రూపొందించిన 'రాధాకృష్ణయ్య' సినిమాలో ఓ ముఖ్య పాత్రను ధరించారు. ఇది మంచి చిత్రంగా పేరుగాంచినా, ఆర్థికంగా విజయవంతం కాలేదు. అందుకే ఈ సినిమా గురించి పెద్దగా చెప్పుకోలేదు. శంకరాభరణం సినిమాలోని శంకరశాస్త్రి పాత్ర ద్వారా అతను ఎంతో పేరు, ప్రఖ్యాతులు గడించారు. దీనితర్వాత 150 సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ, ఇప్పటికీ సోమయాజులు గారికి చిరస్థాయిగా మిగిలిన చిత్రం శంకరాభరణమే. త్యాగయ్య వంటి సినిమాలో అతను ముఖ్యపాత్ర పోషించినా, ఈ చిత్రం రాణింపుకు రాలేదు. అలాగే 'సప్తపది'కూడా అతను ప్రతిభకు గుర్తింపు తీసుకురాలేదు. 'వంశవృక్షం' సినిమాకూ మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. శంకరాభరణం విజయవంతమైన తర్వాత, రెవెన్యూ సర్వీసులో డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పదవీ బాధ్యతల్ని నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నారని, ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఫిర్యాదు చేశారు. అతను పరిశీలించి, సాంస్కృతిక శాఖను ఏర్పరచి ఆ శాఖకు తొలి డైరెక్టర్‌గా సోమయాజులును నియమించారు.1984లో ఎన్.టి.రామారావు ప్రభుత్వం 55ఏళ్ళు నిండిన ప్రభుత్వోద్యోగులపై పదవీ విరమణ వేటు వేసింది. ఆ వేటుకి గాయపడిన వారిలో సోమయాజులు కూడా ఉన్నారు. రాష్ట్ర సాంస్కృతిక డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేసిన ఈ కళాకారుడిని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవించింది. అక్కడి రంగస్థల కళల శాఖకు సోమయాజులు అధిపతిగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే 1993 మార్చి 8వ తేదీన రసరంజని నాటక కళాసంస్థను నెలకొల్పారు. ప్రతిరోజూ నాటకాన్ని ప్రదర్శించాలనీ, టికెట్‌ కొని నాటకాన్ని చూసే ఆదర్శాన్ని పెంపొందించాలనే సదాశయంతో రసరంజని స్థాపన జరిగింది. హైదరాబాద్‌లో నాటకరంగ వికాసానికి ఈ సంస్థ ఎంతో కృషి చేసింది. ఈ క్రమంలో జెవి సోమయాజులు అందించిన కంట్రిబ్యూషన్‌ చెప్పుకోదగింది.

చలన చిత్ర పరిశ్రమలో[2]

[మార్చు]

శంకరాభరణం సినిమాలో "శంకరశాస్త్రి" పాత్రతో ప్రసిద్ధుడయ్యాడు. 'వంశవృక్షం', 'త్యాగయ్య' చిత్రాల్లో బాపు దర్శకత్వంలో నటించడం కూడా జె.వి. సోమ యాజులుకు మరుపురాని అనుభూతినిచ్చింది. నన్ను త్యాగయ్య పాత్రకి, వంశవృక్షంలోని ఆ పాత్రకి బాపు రమణ ఎంపిక చేయడం కూడా నా పూర్వ జన్మ సుకృతమే అన్నాడాయన. త్యాగయ్య చిత్రం హిట్‌ కాకపోయినా అతనుకు మట్టుకు మంచి నటుడిగా పేరొచ్చింది. 'సప్తపది', 'పెళ్ళీడు పిల్లలు', 'నెలవంక', 'సితార', 'స్వాతిముత్యం', 'దేవాలయం', 'కళ్యాణ తాంబూలం', 'ఆలాపన', 'మగధీరుడు', 'చక్రవర్తి', 'స్వయంకృషి', 'స్వరకల్పన', 'అప్పుల అప్పారావు', 'ఆదిత్య 369', 'అల్లరిమొగుడు', 'అభినందన', 'రౌడీ అల్లుడు', 'ముఠామేస్త్రి', 'గోవిందా గోవిందా', 'సరిగమలు', 'కబీర్‌దాస్‌', 'భాగమతి' మొదలైన తెలుగు చిత్రాల్లోను, 'ఇదు నమ్మ ఆలు', 'ఒండగానబా.... శ్రీరాఘవేంద్ర' తమిళ చిత్రాల్లో, 'సోపానం' అనే మలయాళ చిత్రంలో, 'ప్యార్‌ కా సింధూర్‌', 'ప్రతిబంధ్' హిందీ చిత్రాల్లోనూ నటించాడు. టెలివిజన్ ప్రసారం కోసం కన్యాశుల్కాన్ని 13 భాగాల నాటకంగా రూపొందించాడు. జంట నగరాలలో నాటక కళ ప్రోత్సాహానికి "రసరంజని" అనే సంస్థను గరిమెళ్ళ రామమూర్తి, చాట్ల శ్రీరాములు, రాళ్ళపల్లి వంటివారితో కలిసి స్థాపించాడు.

ప్రొఫైల్ :

[మార్చు]
  • పేరు : జొన్నలగడ్డ వెంకట సోమయాజులు (జె.వి.సోమయాజులు)
  • పుట్టిన తేది : 30-జూన్-1928,
  • మరణము : 27-ఏప్రిల్-2004, గుండె పోటుతో హైదరాబాదులో మరణించారు,
  • ఊరు : లుకలాం అగ్రహారం - ఉర్లం దగ్గర, శ్రీకాకుళం జిల్లా,
  • సోదరుడు : జె.వి.రమణమూర్తి (నటుడు),
  • తండ్రి : ఎక్ష్ సైజ్ డిపార్టుమెంటులో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేసారు.,
  • తల్లి : శారదాంబ - ఈయన సక్సెస్ వెనక ఉండి ప్రోత్సాహించేవారు .
  • ఉద్యోగం : విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసుగా పనిచేసారు .

నటించిన సినిమాలు

[మార్చు]
సం చిత్రం పాత్ర సూచన
2005 భాగమతి హిందీ చిత్రం
2003 ఒందాగోణ బా రాఘవయ్య (అజ్జ) కన్నడ చిత్రం
కబీర్ దాస్
2002 దేవి నాగమ్మ
1996 జాబిలమ్మ పెళ్ళి
1994 సరిగమలు
1993 గోవిందా గోవిందా
ముఠా మేస్త్రి
సోపానం రాజ రాజ వర్మ తంబూరన్ మలయాళ చిత్రం
1992 అల్లరి మొగుడు
1991 రౌడీ అల్లుడు
ఆదిత్య 369 మహామంత్రి తిమ్మరసు
అప్పుల అప్పారావు శంకర శాస్త్రి
1990 ప్రతిబంధ్ ముఖ్య మంత్రి సత్యేంద్ర హిందీ చిత్రం
అన్న-తమ్ముడు
1989 స్వరకల్పన
1988 ఇడు నమ్మ అలు శ్రీనివాస శాస్త్రి తమిళ చిత్రం
1987 విశ్వనాధ నాయకుడు మహామంత్రి తిమ్మరుసు
స్వయంకృషి
చక్రవర్తి స్వామిజీ
గౌతమి
మజ్ను
సంకీర్తన
1986 కలియుగ పాండవులు
మగధీరుడు
ఆలాపన
కల్యాణ తాంబూలం
శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం నానా చందోర్కర్
తాండ్ర పాపారాయుడు
1985 విజేత నరసింహం
దేవాలయం
యార్? తమిళ చిత్రం
స్వాతిముత్యం
శ్రీ రాఘవేంద్ర సుధీంద్రాచార్యులు తమిళ చిత్రం
1983 సితార
నెలవంక రహీం
1982 పెళ్లీడు పిల్లలు పి.వి.రావు
1981 త్యాగయ్య త్యాగయ్య
1980 వంశవృక్షం
సప్తపది యాజులు
1979 శంకరాభరణం శంకర శాస్త్రి విజేత, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటులు – తెలుగు
1976 జ్యోతి

ముగింపు

[మార్చు]

150 సినిమాల్లో నటించినా, టివి సీరియల్స్‌లో కూడా ఎన్నో పాత్రలు ధరించాడు. నాటక, సినిమా, టివి రంగాలకుఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన ఘనుడాయన. చివరి శ్వాసవరకు నటనమీద గౌరవంతో ఆరాధనాభావంతో జీవించాడు. చివరిదశలో ఆరోగ్యం సహకరించకపోయినా చేయగలిగినంత చేశాడు. కళాకారుడు కడవరకు కళాకారుడేనని సోదాహరణంగా నిరూపించాడు. ఇతను రిటైరయ్యేనాటికి సాంస్కృతిక విభాగంలో డైరెక్టరుగా పనిచేసేవాడు. 2004 ఏప్రిల్‌ 27వ తేదీన ఈ లోకంనుండి నిష్క్రమించాడు.[3]

ఫొటో గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "జె.వి సోమయాజులు జీవిత చరిత్ర". Archived from the original on 2016-03-04. Retrieved 2012-11-11.
  2. జె.వి సోమయాజులు కళా ప్రస్థానం[permanent dead link]
  3. "An actor in the classical mould.The Hindu". Archived from the original on 2009-06-12. Retrieved 2008-11-29.

బయటి లింకులు

[మార్చు]