మోదడుగు విజయ్ గుప్తా | |
---|---|
జననం | 1939 ఆగష్టు 17 గుంటూరు జిల్లా, బాపట్ల |
నివాస ప్రాంతం | గుంటూరు జిల్లా, బాపట్ల |
ప్రసిద్ధి | వ్యవసాయ శాస్త్రవేత్త |
Notes 2015లో కొరియా శాంతి బహుమతిని అందుకున్నారు |
మోదడుగు విజయ్‌గుప్తా, మత్స్య సాగుల పరిశోధకులు, జీవ శాస్త్రవేత్త. ఆయనకు 2005 లో "వరల్డ్ ఫుడ్ ప్రైజ్" లభించింది[1]. ఆయన తక్కువ వ్యయంతో మంచినీటి చేపల వ్యవసాయం గూర్చి చేసిన అభివృద్ధికి గానూ ఈ బహుమతి ఆయనకు లభించింది.[2] ఈయన ఈ అవార్డు అందుకున్న ఆరవ భారతీయుడు.[3] ఈ అవార్డు పొందిన తొలి ఆంధ్రుడిగా చరిత్ర పుటలకెక్కారు.
ఆయన గుంటూరు జిల్లా, బాపట్ల పట్టణంలో 1939, ఆగష్టు 17న జన్మించారు. ఎం.ఎస్.సి డిగ్రీ అందుకున్న తరువాత చీరాల కాలేజీలో అధ్యాపకునిగా కొంతకాలం పాటు పనిచేసారు. ఆ తరువాత ఆస్సాం రాష్ట్రంలో ఒక కళాశాలలో "జంతు శాస్త్ర శాఖాధిపతి"గా కూడా పనిచేసారు. ఆ కాలంలో ఆయన పరిశోధనలపై దృష్టి సారించారు. పరిశోధనలు చేస్తూ ఆయన మరింత అభివృద్ధి సాధించడానికి కలకత్తా వెళ్ళి "ఫిషరీస్ రీసెర్చి"లో ప్రవేశించారు.[4]
ఆయన పరిశోధనలను ముమ్మరంగా సాగించేందుకు, ప్రత్యాక్ష అధ్యయనం చేసేందుకు స్వయంగా రైతుల చేపల చెరువులకు వెళ్ళి, చెరువు గట్ల పైనే పరిశోధనలు ప్రారంభించారు. రైతుల అవసరాలు, సమస్యలు కూడా అవగాహన చేసుకొని అందుకు అనుగుణంగా తన పరిశోధనలు కొనసాగించారు. అధికోత్పత్తి వలననే చేపల రైతులకు గిట్టుబాటు అవుతుందని గ్రహించి, ఆ దిశగా ప్రయోగాలు చేసి, రెండు రకాల కొత్త రకాల చేపలను "రిబ్బన్ ఫిషెస్" పేరుతో ఉత్పత్తి చేసారు. వీటి పెంపకంతో ఒకటిన్నర నుంచి మూడు, అయిదు టన్నుల స్థాయి వరకు అధిక దిగుబడి వచ్చింది.[5]
ఆయన వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) తరపున మత్స్య సాగులకు అందించిన అపురూపమైన సేవలను ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆయనకు మత్స్య శాస్త్ర నిపుణుడిగా ప్రపంచ దేశాలకు మరింత కృషి జరిపేందుకు, పరిశోధనలు చేసి ఫలాలను రాబట్టడానికిఅవకాశం కల్పించింది.
కన్సల్టేటివ్ గ్రూపు ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి (పెనాంగ్, మలేసియా) అధ్వర్యంలోని మత్స్య పరిశోధన సంస్థ వరల్డ్ ఫిష్ కు అసిస్టెంట్ డైరక్టరుగా ఆయన పదవీవిరమణ చేసారు.[6]
ఈయనకు కిరిబాటి దీవుల అధ్యక్షుడు అనోట్ టాంగ్ శుక్రవారం ఆగష్టు 29 2015 న కొరియా శాంతి బహుమతిని అందుకోనున్నారు. వీరికి రూ.3.30 కోట్ల ప్రైజ్ మనీ అందజేస్తారు.[7]
ఈయనకు 2023లో పద్మశ్రీ [8]ప్రకటించగా[9], ఆయన ఆ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా 2023 మార్చి 22న అందుకున్నాడు.[10]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
Honorary titles | ||
---|---|---|
అంతకు ముందువారు Yuan Longping |
World Food Prize 2005 |
తరువాత వారు Lobato, Paolinelli, and McClung |