సంధ్యా అగర్వాల్ (Sandhya Agarwal) భారతదేశానికి చెందిన మాజీ మహిళా క్రికెట్ క్రీడాకారిణి.ఈమె మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణానికి చెందిన వ్యక్తి.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సంధ్యా అగర్వాల్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఇండోర్ , మధ్య ప్రదేశ్, భారత దేశము | 1963 మే 9|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేతి బౌలింగ్ ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 22) | 1984 3 ఫిబ్రవరి - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1994 17 నవంబర్ - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 26) | 1984 23 ఫిబ్రవరి - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1995 14 నవంబర్ - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
రైల్వేస్ | ||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2013 11 జనవరి |
అగర్వాల్ భారత మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది.[1] 1984 నుంచి 1995 వరకు భారత జట్టు తరఫున 13 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది. ఈ కాలంలో ఆమె 50.45 సగటుతో 1110 పరుగులు సాధించింది. అందులో 4 శతకాలు కూడా ఉన్నాయి. 1986లో ఇంగ్లాండుపై 190 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించి, 1935లో బెట్టీ స్నోబాల్ రికార్డును అధికమించింది. మహిళా క్రికెట్ లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 1987లో డెనిస్ అన్నెట్స్ 193 పరుగులు చేసే వరకు ఇది ప్రపంచ రికార్డుగా కొనసాగింది. అగర్వాల్ 21 మహిళా వన్డే పోటీలను కూడా ఆడి 31.50 సగటుతో 567 పరుగులు సాధించింది.[2] ఆమె ప్రధాన జట్లలో భారత మహిళా క్రికెట్ జట్టు, రైల్వేస్ మహిళల క్రికెట్ జట్టు ఉన్నాయి.[3]
క్ర సంఖ్య | పరుగులు | ప్రత్యర్థి జట్లు | పట్టణము /దేశము | స్టేడియం | సంవత్సరం |
---|---|---|---|---|---|
1 | 134 | ఆస్ట్రేలియా | బొంబాయి, భారతదేశము | వాంఖేడ్ | 1984[5] |
2 | 106 | న్యూజిలాండ్ | కటక్, భారతదేశము | బరబాటి | 1985[6] |
3 | 132 | ఇంగ్లాండ్ | బ్లాక్ పూల్, ఇంగ్లాండ్ | స్టాన్లీ పార్క్ | 1986[7] |
4 | 190 | ఇంగ్లాండ్ | వోర్న్స్టెర్, ఇంగ్లాండ్ | న్యూరోడ్ | 1986[8] |
ఆమె క్రికెట్ ఆట నుంచి విరామం తీసుకున్న తర్వాత, అగర్వాల్ సెలెక్టర్ గా, శిక్షకురాలుగా క్రికెట్‌కు సహకారం అందించారు. ఆమె బాలికల U-19, మధ్య ప్రదేశ్ క్రికెట్ సంఘం సీనియర్ మహిళల జట్టుకు సభాధక్షురాలు (చైర్‌పర్సన్), BCCI మహిళా కమిటీ సభ్యురాలుగా పనిచేసింది. 2017లో, అగర్వాల్‌కు లార్డ్స్ గ్రౌండ్‌కు సంబంధించిన 'ది మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్' గౌరవ జీవిత సభ్యత్వాన్ని అందించింది.[9]
13 టెస్ట్ మ్యాచ్ లు, 21 ఒకరోజు అంతర్జాతీయ పోటీలను ఆడినందుకు మధ్య ప్రదేశ్ క్రికెట్ సంఘం వారు రు.25,00 లక్షలు నగదు బహుమతిగా ఇచ్చారు.[10]