దువ్వూరి సుబ్బారావు | |
---|---|
![]() దువ్వూరి సుబ్బారావు | |
జననం | దువ్వూరి సుబ్బారావు ఆగష్టు 11, 1949 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు |
వృత్తి | భారతీయ రిజర్వ్ బాంక్ 22వ [1] గవర్నర్ |
ప్రసిద్ధి | భారతీయ రిజర్వ్ బాంక్ 22వ [1] గవర్నర్ |
పదవి పేరు | రిజర్వ్ బ్యాంకు గవర్నర్ |
ముందు వారు | వై.వేణుగోపాలరెడ్డి |
భార్య / భర్త | ఊర్మిళ |
పిల్లలు | మల్లిక్, రాఘవ |
తండ్రి | మల్లికార్జునరావు |
తల్లి | సీతారామం |
భారతీయ రిజర్వ్ బాంక్ 22వ [1] గవర్నర్‌గా నియమితుడైన దువ్వూరి సుబ్బారావు ఆగష్టు 11, 1949న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన చెందిన తెలుగు వ్యక్తి. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్.పట్టా పొందిన సుబ్బారావు 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగాను పనిచేశాడు. 2004 నుంచి 2008 వరకు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన తరువాత భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితుడై, ఆ పదవిలో 2013 సెప్టెంబరు 4 వరకు ఉన్నాడు.
దువ్వూరి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1949 ఆగష్టు 11న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన తండ్రి మల్లికార్జునరావు తల్లి సీతారామానికి మూడవ సంతానంగా జన్మించాడు. కోరుకొండ సైనిక పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసి బిఎస్సీకై సీఆర్ఆర్ కళాశాలలో ప్రవేశించాడు. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టా పొందగా, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి పుచ్చుకున్నాడు. 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచి [2][3] ఐఏఎస్ ఆంధ్రా కేడర్ అధికారిగా తొలుత నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు.
సుబ్బారావు ఆర్థిక శాస్త్రంతో పాటు భౌతిక శాస్త్రాన్ని కూడా ఎంతో లోతుగా చదువుకున్నాడు. అతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదువుకునేటప్పుడు, అలాగే తన సివిల్స్ పరీక్షలకు కూడా భౌతిక శాస్త్రాన్ని తన ముఖ్యమైన సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాడు. స్టీఫెన్ హాకింగ్ రాసిన "బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం" అనే పుస్తకం పైన ఒక విక్లీలో సమీక్ష రాశాడు సుబ్బారావు. ఈ సమీక్ష "ఫ్రం ద ఎటర్నిటీ" అనే పేరుతో ప్రచురితమైంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి సుబ్బారావు కావడం విశేషం.
సుబ్బారావు 1988 నుండి 1993 మధ్య కాలంలో భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలో, ఆర్థిక వ్యవహారాల శాఖకు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు.[4] ఆ తరువాత, 1993 నుండి 1998 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో తన పదవీకాలం పూర్తి అయిన తరువాత ప్రపంచ బ్యాంకుకు ప్రధాన ఆర్థిక శాస్త్రజ్ఞుడిగా బదిలీ చేయబడ్డాడు. ప్రపంచ బ్యాంకులో 1999 నుండి 2004 వరకూ ఆ పదవిలో కొనసాగాడు. అటు పైన 2005 నుండి 2007 వరకూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా సంఘంలో ముఖ్య పదవి పోషించాడు. 2007లో భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. 2008 సెప్టెంబరు 5న, భారత ఆర్థిక రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పదివి అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) కు 22వ గవర్నర్‌గా నియమితుడు అయ్యాడు.[5] అతని స్థానంలో, 2008 సెప్టెంబరు 21న అరుణ్ రామనాథన్ ఆర్థిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు.[6] 2011లో సుబ్బారావు పదవీ బాధ్యతలు మరో రెండేళ్ళు పొడిగింపబడ్డాయి.[7]
సుబ్బారావు ఎన్నో ఆర్థిక కోశ విధానాల సవరింపులను చేపట్టాడు. తూర్పు ఆసియాలోని ముఖ్య దేశాలు అయిన చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పైన్‌స్, కంబోడియాలలో ఆర్థిక వికేంద్రీకరణ చర్యలకు ఉపయోగపడే ఎన్నో అధ్యయనాలు నిర్వహించాడు. వాటిని అమలుపరిచే విధానలను కూడా రూపొందించి, వాటి అమలుకు ఎంతో తోడ్పడ్డాడు సుబ్బారావు. 90వ దశకం చివరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. తలకు మించిన అప్పుల భారంతో ఇబ్బందిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా పుంజకునేలా చేసిన ఘనత సుబ్బారావుకే దక్కింది. అతను ప్రవేశపెట్టిన కొన్ని ఆర్థిక విధానాల వల్ల లోటు బడ్జెట్‌లోకి కూరుకుపోయిన ఆర్థిక శాఖ, మిగులు బడ్జెట్‌లోకి నడవడం గమనార్హం.[5]
ఆర్.బి.ఐ గవర్నర్‌గా పనిచేసే సమయంలో ఆర్.బి.ఐ నుండి వెలువడే పత్రికలలో ఎన్నో ఆర్థిక విధానాలను అందరికీ అర్ధమయ్యే రీతిలో వాటిని విపులంగా, సులభతరంగా మార్చి ప్రచురింపజేశాడు సుబ్బారావు.[8] సెంట్రల్ బ్యాంకు పాలసీలను, క్లిష్టతరమైన ఆర్థికపరమైన విధానలను సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా ఉండేవి ఆ ప్రచురణలు. మారుమూల పల్లెలలోని వారికి కూడా ఆర్థిక అక్షరాస్యత అందే విధంగా ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, నిర్వహించాడు సుబ్బారావు. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో 100శాతం ఆర్థిక విధానాల వినియోగానికి శ్రీకారం చుట్టిన ఘనత సుబ్బారావుకే దక్కింది.[9]
{{cite news}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)
<ref>
ట్యాగు; Indian Express
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
{{cite news}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)